ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో విజయ డెయిరీ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ బృందం ఆధ్వర్యంలో నిరంతరం లాక్డౌన్ విధుల్లో శ్రమిస్తున్న పోలీసులకు రెండు వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ మజ్జిగ ప్యాకెట్లు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.