HOME » VIDEOS » Telangana

Video : హోలీ వేడుకల్లో పిడిగుద్దులు.. నిజామాబాద్ లో వింత ఆచారం

తెలంగాణ22:34 PM March 10, 2020

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స గ్రామంలో హోళీ పండగ వేళ పిడిగుద్దుల ఆట ఆచారంగా కొనసాగుతున్నది. గ్రామంలోని పురుషులు అందరూ ఒక చోటకు చేరి పిడికిళ్ళతో గుద్దు కోవడం 130 ఏళ్ల నుండి ఆచారంగా కొనసాగుతోంది. ఆట నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం అని గ్రామస్థుల నమ్మకం. హోళీ పండగ రోజు గ్రామంలో ని హనుమాన్ మందిరం కూడలి వద్ద రెండు కర్రలు పాతి అటు ఇటు తాళ్లను కడతారు. ఈ తాళ్లకు రెండు వైపులా గ్రామంలో ని పురుషులు చేరుకొని పిడికిలి బిగించి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. సుమారు 20 నిమిషాల పాటు ఆట కొనసాగుతుంది.ఆట ముగిసిన వెంటనే అలాయి బలాయి తో ఒకరినొకరు కరచాలనం చేసుకుంటారు.ఈ ఆటలో గాయపడిన వారు కమదహన బూడిదను పూసుకుంటారు. ఎలాంటి గాయమైన మానిపోతుందని గ్రామస్థుల నమ్మకం. ఆంక్షలు ఉన్నప్పటికీ తమ ఆచారం కొనసాగిస్తామని గ్రామస్థులు గట్టి పట్టుదల తో ఉంటారు. ఆట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

webtech_news18

Top Stories