World Bicycle Day : వరల్డ్ బైస్కిల్ డే సందర్బంగా ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరై..కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈవెంట్లో పెద్ద ఎత్తున సైకిలిస్టులు, స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని.. హైదరాబాద్ లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.. దీనిని అరికట్టాల్సిన అవసరముందని అన్నారు. సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి, సమాజానికి మేలు చేకూరుతుందన్నారు. అనంతరం GHMC జోనల్ కమిషనర్ హరి చందన, మాజీ MLA చింతల రామ చంద్ర రెడ్డితో కలిసి కిషన్ రెడ్డి సైకిల్ రైడ్ చేసారు.