హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బతికి ఉన్న పసిబిడ్డను పూడ్చిపెట్టే ప్రయత్నం.. ఓ తాత అమానుషం

తెలంగాణ20:11 PM October 31, 2019

హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. జూబ్లి బస్ స్టేషన్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఓ పసిబిడ్డను పూడ్చిపెట్టేందుకు ఇద్దరు ప్రయత్నం చేశారు. అయితే, దీన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వగానే వారు వచ్చి ఆ ఇద్దరినీ పట్టుకున్నారు. ఆ పసిబిడ్డ బతికి ఉండగానే వారు పాతిపెట్టడానికి ప్రయత్నించినట్టు నిర్ధారించారు. ఎందుకు అలా చేస్తున్నారని పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించగా తాము కరీంనగర్‌కు చెందిన వారిమని, ఆ బిడ్డ తమ మనమరాలని చెప్పారు. రెండు రోజుల క్రితం ఓ ఆపరేషన్ విషలం కావడంతో చనిపోయిందని చెప్పారు. చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్లడానికి ప్రజారవాణాలో ఒప్పుకోరు కాబట్టి.. ఇక్కడ పాతిపెడుతున్నామని చెప్పారు. అయితే, పసిబిడ్డ కదులుతూ ఉండడాన్ని గమనించినపోలీస్ కానిస్టేబుల్ వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పసికందును గాంధీ ఆస్పత్రికి తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading