HOME » VIDEOS » Telangana

Video : కామారెడ్డిలో చిరుతపులి పిల్లలు.. ప్రజల్లో టెన్షన్

తెలంగాణ14:57 PM March 09, 2020

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని భవాని పెట్ గ్రామ శివారులో తాటి వాగు మత్తడి ప్రాంతంలో రెండు చిరుత పులి పిల్లలను గ్రామస్థులు ఆదివారం గుర్తించారు. ఇంట్లో పని నిమిత్తం తాటి వాగు మత్తడి నుంచి ఇసుకను తేవడానికి వెళ్ళిన గ్రామస్తులు చెట్టు తొర్రలో శబ్దం రావడం గమనించారు. దీంతో చెట్టు వద్దకు వెళ్లి చూడగా చెట్టు త్వరలో చిరుతపులి పిల్లలు ఉన్నట్లు గుర్తించి అడవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వాటిని పరిశీలించి చిరుతపులి పిల్లలుగా గుర్తించారు. గ్రామ శివారులో చిరుత సంచారం ఉన్నట్లు తేలడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకొనవాలని గ్రామస్తులు వేడుకొంటున్నారు.

webtech_news18

Top Stories