ఏ బీహార్లోనో ముఠాలు కొట్టుకున్నాయంటే అర్థముంది. కానీ... హైదరాబాద్... ఉప్పల్లో ఇలా జరగడం ఆశ్చర్యమే. 8వ నంబర్ వీధిలో... SR అపార్ట్మెంట్స్ దగ్గర... రెండు గ్యాంగుల మధ్య గొడవ జరిగింది. అది క్షణాల్లో పెద్దదై... ఒకరిపై ఒకరు కలబడి కొట్టేసుకున్నారు. పట్టపగలు, నడిరోడ్డుపై ఆ రేంజ్లో కొట్టుకుంటుంటే షాకై చూడటం స్థానికుల వంతైంది. ఈ దారుణం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. బట్ అది అంత క్వాలిటీతో లేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.