హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : గుప్త నిధుల వేటలో ఇద్దరు బలి

తెలంగాణ14:26 PM May 16, 2019

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి అడవిలో ముగ్గురు గుప్త నిధుల కోసం బయలుదేరారు. హైద్రాబాద్‌కి చెందిన కెనరా బ్యాంకు అధికారి, గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన మరో ఇద్దరు నల్లమల అడవిలో గుట్టల్లోకి వెళ్లారు. ఎండ ఎక్కువగా ఉండటంతో... గుట్టలు ఎక్కేటప్పుడే వారితో తెచ్చుకున్న వాటర్ పూర్తిగా తాగేశారు. తీరా పైకి ఎక్కాక, బాగా దాహం వేసింది. అదే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువవడంతో సొమ్మసిల్లి ఇద్దరు అక్కడే చనిపోయారు. మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడి... విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి, ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. తమ వారు చనిపోవడంతో బాధితులు కన్నీరు పెడుతున్నారు.

Krishna Kumar N