టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎట్టకేలకు సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. నకిలీ, ఫోర్జరీ పత్రాల కేసులో రవిప్రకాశ్ పై అలంద మీడియా ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్ సైబరాబాద్ క్రైం పోలీసుల ముందు హాజరయ్యారు.