తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అప్ కమింగ్ టెలివిజన్ యాంకర్, సీరియల్ నటి శాంతి( అసలు పేరు: విశ్వశాంతి) అనుమానస్పదంగా చనిపోయింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలో ఈమె నివాసం ఉంటుంది. అక్కడే ఎప్రిల్ 9న ఈమె శవమై కనిపించింది. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై చుటుపక్కల వాళ్లను విచారిస్తున్నారు. అలాగే ఆమె ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.