సంగారెడ్డి జిల్లా ఆర్సీ పురానికి ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో కన్నుమూశాడు. రామచంద్రాపురం బాంబే కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఖలీల్ మియా(48) హెచ్సీయూ బస్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఖలీల్ మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు.