కామారెడ్డి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ చెక్ పోస్టు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఆ పోలీసు వాహనం వెళ్లి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలు అయ్యాయి. ఆర్టీసీ బస్సును నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్ నిర్వాకం వల్లే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.