హోమ్ » వీడియోలు » తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీకి షాక్.. గౌరవం దక్కట్లేదంటూ పార్టీకి సీనియర్ నేత రాజీనామా

తెలంగాణ16:01 PM July 09, 2019

పెద్దపల్లి జిల్లా రామగుండం టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇండిపెండెంట్‌గా గెలిచిన చందర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో మనస్థాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తన సేవలను పార్టీ ఉపయోగించుకోవడం లేదని, సభ్యత్వ నమోదు లో కనీసం రసీదులు ఇవ్వకుండా అవమానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

webtech_news18