హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి తెరాస ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే సైది రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచెర్ల భూపాల్ రెడ్డి, హుజూర్ నగర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.