హోమ్ » వీడియోలు » తెలంగాణ

ఆషాడంలో ఆదివాసుల అకాడి పూజలు.. సందడిగా మారిన గిరిసీమలు..

తెలంగాణ10:37 AM July 16, 2019

అడవుల జిల్లా, ఆదివాసుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడల్లో అకాడిపేన్ పూజల సందడి నెలకొంది. ప్రతి యేటా ఆషాడ మాసంలో గిరిజనులు అకాడి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతిని ప్రేమించడం, ఆరాధించడం ఆదివాసీ గిరిజనుల సంస్కృతిలో భాగం. అందులో భాగంగా వర్షాకాలంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అకాడి పూజలు చేస్తారు ఇక్కడి గిరిజనలు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని, పశువులకు, పశువుల కాపరులకు అటవీ జంతువులు ఎలాంటి హానీ తలపెట్ట వద్దని కోరుతూ ఈ పూజలు చేస్తారు. అకాడి పేన్ పూజల్లో భాగంగా గ్రామ అటవీ ప్రాంతంలో తమ కులదైవానికి పూజలు చేస్తారు. అన్నంతో లేదా జొన్నగట్కతో లడ్డుల మాదిరి నైవేద్యాన్ని తయారు చేసి దేవతలకు సమర్పిస్తారు. కోళ్ళు, మేకలను కూడా బలి ఇస్తారు. అక్కడే వంటలు చేసి టేకు అకుల్లో సామూహికంగా భోజనాలు చేస్తారు. అంతకు ముందు పులి కట్టు గీసి పశువులను దానిపై నుండి దాటిస్తారు. అలా చేస్తే అటవీ జంతువులు పశువులకు హాని తలపెట్టవని వారి నమ్మకం. ఈ అకాడి పండుగ తర్వాతనే వారి ప్రధాన పండుగలు ఆరంభమై దీపావళికి గుస్సాడీల వరకు కొనసాగుతాయి.

webtech_news18