HOME » VIDEOS » Telangana

Video: మద్యం అమ్మకాలు బంద్.. గిరిజన మహిళల సంబరాలు

తెలంగాణ22:49 PM November 01, 2019

కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూర్(యు), లింగపూర్ మండలాల ప్రజలు మద్యం మహమ్మారిని తరిమికొట్టారు. తమ గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేపట్టకూడదని అందరూ తీర్మానం చేసి అధికారులకు నివేదించారు. వారి విజ్ఞప్తి మేరకు ఆ మూడు మండలాల్లో మద్యం నిషేధించారు. ఈ నేపథ్యంలో మండలాల్లోని ఆదివాసీ గిరిజన మహిళలు విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి జైనూర్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కొమురంభీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు

webtech_news18

Top Stories