హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇసుక కోసం వెళ్లిన ఓ ట్రాక్టర్ వాగులో చిక్కుకుపోయింది. ఇసుకను లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద పెరగడంతో ఎటూ వెళ్లలేక అక్కడే నిలిచిపోయింది. డ్రైవర్ కూడా అందులోనే ఉండిపోయాడు. స్థానికులు చేరుకొని అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.