హోమ్ » వీడియోలు » తెలంగాణ

విందు భోజనం వికటించి 30 మందికి అస్వస్థత...దవాఖానకు తరలింపు

తెలంగాణ07:22 PM IST Jun 05, 2019

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం చిమాన్ గుడి గ్రామంలో విందు భోజనం వికటించి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలకు ముందు గిరిజనులు పంటలు సమృద్ధిగా పండాలని దసరా పండుగ జరుపుకుంటారు.ఈ సందర్భంగా నిన్న గిరిజనులు తమ కుల దేవతలకు మేకలను బలి ఇచ్చారు. పండుగను జరుపుకుని నిన్న సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు. మిగిలిన భోజనాన్ని ఈరోజు ఉదయం 8 గంటలకు భుజించారు. అయితే 14 గంటల తరువాత అదే ఆహారాన్ని భుజించడంతో ఆహారం వికటించి 30 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారి గ్రామంలోనే మెడికల్ క్యాంప్ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.క్యాంప్ లో వెంటనే వైద్యం అందించారు.సీరియస్ గా ఉన్న పలువురిని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలోంచి వైద్యం అందించారు.

webtech_news18