ఖమ్మంజిల్లా కల్లూరు మండల కేంద్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కిషోర్ తన ఇంట్లో స్నూపీ(కుక్క)ను పెంచుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నాం ఓ తాచుపాము ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేయబోయింది. దీంతో స్నూపీ వెంటనే పామును నోట కరిచి బయటకు లాక్కొచ్చింది. కిషోర్ కర్రతో తాచుపామను చంపగా, అప్పటికే స్నూపీని పాము కరవడంతో చనిపోయింది.