కుటుంబ సభ్యులు, బంధువులు లేకుండానే తెలంగాణలో తొలి కరోనా మృతుడి అంత్యక్రియలు జరిగాయి. మతాచారాలతో సంబంధం లేకుండా ప్రొటోకాల్ ప్రకారం.. హైదరాబాద్‌లో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. దాదాపు 14 మంది మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధీనంలో ఉన్న ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం వలన అంత్యక్రియలకు వారెవరూ హాజరు కాలేకపోయారు. దీంతో తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందే అత్యక్రియలను పూర్తి చేశారు. డెడ్‌బాడీని పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసిన తరువాత తగు జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల వారిని, మత పెద్దలను కూడా అక్కడికి అనుమతించలేదు.