సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని భీరం గూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంను కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయ కమిషనర్ ఆదేశాల మేరకు మూసివేయబడినది. ఈ నెల 20 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రహల్లాద్ వెల్లడించారు. గుడిలో ఉదయం పూట ప్రతి రోజు పూజలు చేస్తామని అన్నారు.