Nallamala Road Accident : నల్లమల అడవుల్లో రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఇప్పటికీ ఏదో ఒక వాహన ప్రమాదం జరుగుతూనే ఉంది. దైవదర్శనం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు జోగులాంబ గద్వాల జిల్లా... దౌవుదర్ పల్లి గ్రామ వాసి నవీన్ మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా... అమ్రాబాద్ మండలం... నల్లమలలోని పరహాబాద్ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచీ తిరుగు ప్రయాణంలో సొంతూరైన జోగులాంబ గద్వాల జిల్లా దౌవుదర్ పల్లి వెళ్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.