హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : టీఆర్ఎస్‌‌కి వ్యతిరేకంగా భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు దీక్ష

తెలంగాణ02:46 PM IST Jun 06, 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 19 స్థానాల్లో గెలవగా... వారిలో 12 మంది ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్‌లో చేరిపోయారు. వారంతా స్పీకర్ పోచారంకి లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో కలిపేయాలని కోరారు. ఇందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటంతో... ఈ ప్రక్రియ సజావుగా సాగిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... 12 మంది ఎమ్మెల్యేలకు విందు సమావేశం ఏర్పాటు చేసి... విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు దిగుతోందంటూ... దీక్షకు దిగారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు (హుజూర్ నగర్)కి రాజీనామా చేశారు. అందువల్ల ప్రస్తుతం భట్టి, శ్రీధర్ బాబుతోపాటూ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో ఎంతమంది టీఆర్ఎస్‌‌లోకి జంప్ చేస్తారో చెప్పలేం.

Krishna Kumar N