HOME » VIDEOS » Telangana

Video : 500 ఓట్లు గల్లంతు... అధికారులను నిలదీసిన ప్రజలు

తెలంగాణ13:04 PM January 30, 2019

Telangana Panchayat Elections : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నరం గ్రామపంచాయితీలో పోలింగ్‌కి అంతరాయం కలిగింది. 500 ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500ల ఓట్లు లేకపోవడం... ఇదివరకు ఎప్పుడూ జరగంది... ఇప్పుడే ఇలా జరగడమేంటని... వారంతా అధికారులను నిలదీశారు. మళ్లీ ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న ఓటర్ లిస్టులో కొన్ని పేజీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు... మండలంలోని ఓటర్ లిస్టు తెప్పించి చూశారు. అందులో అందరి ఓట్లూ ఉన్నాయి. దాంతో పోలింగ్ కొనసాగించిన అధికారులు... పేజీలు తొలగించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Krishna Kumar N

Top Stories