హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి కాన్వాయ్‌కి ప్రమాదం

తెలంగాణ15:17 PM February 17, 2020

హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లోని వెంగళరావు పార్క్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత ఆయన వేరే వాహనంలో వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాద కారణంగా అక్కడ కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

webtech_news18