తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తూ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. అందులోనూ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి వినోద్‌కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 89 వేల మెజారిటీతో అద్భుత విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 14,567 ఓట్ల తేడాతో ఓడిన సంజయ్ కుమార్... లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకోవడంతో కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు.