తెలంగాణలో బీజేపీ నేతల సంబరాలు అంబరాలను అంటుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయిన ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్ స్థానాలతో పాటు సికింద్రాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థులు విజయభావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించిన అరవింద్ విజయం సొంతం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూలేనంతగా బీజేపీకి 4 ఎంపీ స్థానాలు రావడంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆనందంతో చిందులు వేశారు.