హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అప్పులు పెరిగాయని ఆత్మహత్య...బహ్రెయిన్‌లో తెలంగాణవాసి మృతి

తెలంగాణ08:39 PM IST Jan 10, 2019

బహ్రెయిన్‌లో తెలంగాణవాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం కొత్త కోరుట్ల తాండాకి చెందిన బదావత్ గణేష్ కొన్ని రోజుల క్రితం గల్ఫ్‌కి వెళ్లాడు. ఐతే అప్పులు ఎక్కువగా ఉండడం..వేతనం తక్కువగా ఉండడంతో..తీవ్ర మనవేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉందని.. పనికి రాలేనని తన సహచరులకు చెప్పాడు. తన సహచరులు విధులు ముగించుకుని వచ్చేసరికి గణేష్ ఉరివేసుకుని విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య ప్రస్తుతం గర్భవతి. వీరి ఓ కుమార్తెగా ఉంది. గణేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

webtech_news18