తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ మనవడు పుర్కాన్ అహ్మద్ తన స్నేహితుడితో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వివాదాస్పద వీడియోలో హోం మంత్రికి కేటాయించిన అధికారిక వాహనంపై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు.