వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలని బోయహక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ కులస్తులను కించపరిచే విధంగా వాల్మీకి టైటిల్ పెట్టారని.. అందుకే వెంటనే ఈ టైటిల్ తొలగించాలని పిటీషనర్ కోర్టుకు విన్నవించుకున్నాడు. దీనిపై విచారించిన హైకోర్టు చిత్రయూనిట్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్, డిజీపీ, హీరో వరుణ్ తేజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హై కోర్టు ఆదేశించింది.