కామెరెడ్డి: కరోనాకు తోడు ఆకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ ఆకాల వర్షాలు, ఈదురు గాలులు రైతు కష్టంలో నీల్లు పోస్తున్నాయి.. దీంతో పంట కోతపై వైరస్ ప్రభావం బాగానే కనిపిస్తోంది. ఓ వైపు లాక్డౌన్ కారణంగా రవాణానిలిచిపోయి హార్వేస్టర్లు దొరకడం లేదు. అక్కడ అక్కడ జల్లులు కురిసి ధాన్యం రాశులు తడిచి పోతున్నాయి.. దీంతో కామారెడ్డి జిల్లా అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.