తెలంగాణలో పౌరసత్వ చట్టాన్ని అమలు చెయ్యకుండా... కేంద్రానికి తిప్పి పంపాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. చిత్రమేంటంటే... పౌరసత్వ సవరణ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించింది. MIM కూడా పౌరసత్వ చట్టాన్ని రద్దు చెయ్యాలని కోరుతోంది. అంటే... తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతిస్తున్న MIMకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్... ఈ చట్టాన్ని తెలంగాణలో అమలు చేస్తుందా లేదా అన్నది త్వరలో తేలనుంది.