వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వయసు పైబడిన వారికి సేవ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. టాటా ట్రస్టుతో భాగస్వామ్యం ఏర్పడి వృద్ధుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబరు 14567ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ అవకాశాన్ని వృద్ధులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సదుపాయాన్ని కల్పించిన టాటా సంస్థకు, తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.