హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ11:40 AM September 08, 2019

Tamilisai Soundararajan : తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరించిన తమిళిసై సౌందరరాజన్... తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణం చేయించారు. ఆ కార్యక్రమానికి సంప్రదాయం ప్రకారం సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు ముందు... ప్రత్యేక చాపర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన తమిళసై సౌందరరాజన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కొత్త మంత్రులతో ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు. సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వం... 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా... తెలంగాణలో నిన్నటివరకూ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ స్థానంలో... తమిళిసై సౌందర‌రాజన్‌ను నియమించింది. తమిళిసై సౌందరరాజన్ వృత్తి రీత్యా డాక్టర్. తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో జన్మించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె ఉన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో తమిళిసై సౌందరరాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లుగా ఎంపీగా పోటీ చేసినా ఒక్కసారీ ఆమెకు గెలుపు దక్కలేదు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading