HOME » VIDEOS » Telangana

Video : ఇంటర్ బోర్డు అవకతవకలపై నిజామాబాద్‌లో విద్యార్థుల ధర్నా

తెలంగాణ11:42 AM April 25, 2019

ఇంటర్ బోర్డు తప్పిదాలకు నిరసనగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలో అందోళనకు దిగారు. నగరంలోని ఇంటర్ బోర్డు అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇంటర్ బోర్డు పరీక్షలు జరిపేందుకు అనుభవం లేని సంస్థకు అవకాశం కల్పించి విద్యార్థులు జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఇంటర్ వివాదంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. రీవాల్యుయేషన్‌కు అప్పీల్ చేసుకునేందుకు సైట్ ఓపెన్ కావడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.. 23 మంది విద్యార్థులు అధికారుల తప్పిదానికి ప్రాణ త్యాగం చేసి కన్నవారికి కడుపు కోత మిగిల్చారని అన్నారు. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదానికి తేదీల పొడిగింపు సరిపోదని పేర్కొన్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల చనిపోయిన విద్యార్థుల ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలరా అని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్య శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు .

webtech_news18

Top Stories