హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : విద్యార్థుల డేంజర్ స్టంట్... ఆర్టీసీపై విమర్శలు

తెలంగాణ12:34 PM September 13, 2019

అంతా కాలేజీ, స్కూల్ విద్యార్థులు. త్వరగా వెళ్లాలి. టైమ్ అయిపోతోంది. బస్సులు చూస్తే... రావాల్సిన టైముకి రావట్లేదు. కొన్ని ఏరియాల్లో అసలు బస్సు సర్వీసులే సరిగా లేవు. అప్పుడు మేం ఏం చెయ్యాలి. ఎలా వెళ్లాలి అని ప్రశ్నిస్తూ ఆ విద్యార్థులు... బస్సు వెనక ఎక్కేశారు. అది ఎంతో ప్రమాదకర ప్రయాణం. దాదాపు ఏడుగురు విద్యార్థులు... విరిగిపోయిన బస్సు అద్దం నుంచీ లోపలికి చెయ్యి పెట్టి వేలాడుతూ ప్రయాణించారు. ఉప్పల్ డిపోకి సంబంధించిన ఆ బస్సులో విద్యార్థులు చేసిన సాహసంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. విద్యార్థులు ఇలా చేస్తే ఎలా... తప్పని తెలియదా అని కొందరు అంటుంటే... బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్లే వాళ్లు ఇలా చేశారని మరికొందరు అంటున్నారు. వాళ్లకు ఏమైనా అయితే... ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు.

Krishna Kumar N