హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ట్రంప్ మనసు మార్చండి.. చిలుకూరు బాలాజీకి టెకీల పూజలు

తెలంగాణ16:40 PM February 21, 2020

ట్రంప్ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు క్యూ కడుతున్నారు. విదేశాలకు వెళ్లదలచుకున్న భక్తులు ఇండియాలో ట్రంప్ పర్యటన సందర్భంగా ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. H1B వీసాలను తగ్గించాలన్న ట్రంప్ ఆలోచనా ధోరణిని, భారతీయుల పట్ల ట్రంప్‌ మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని ప్రార్థించారు. చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీగా పేరుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయదలచుకున్న వారు.. ఇక్కడకు వచ్చి 11 సార్లు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటే వీసాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

webtech_news18