HOME » VIDEOS » Telangana

Video : సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

తెలంగాణ16:40 PM October 19, 2019

సాగర్‌ కాల్వ నుంచి వెలికితీసిన కారులో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం నాడు మిత్రుడి విహహానికి హాజరై తిరిగి వస్తుండగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద కారు అదుపుతప్పి ఎన్‌ఎస్‌పీ కాల్వలోకి దూసుకెళ్లింది. కారులోని ఆరుగురు వ్యక్తులు గల్లంతైయ్యారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. 18 గంటల శ్రమ అనంతరం క్రేన్‌ సాయంతో కాల్వలో పడ్డ కారును బయటకు తీశారు. గల్లంతైన ఆరుగురు మృతిచెందారు. మృతులను అబ్దుల్‌ అజీజ్‌(వైజాగ్‌), జిన్సన్‌(కేరళ), రాజేశ్‌, సంతోష్‌(హైదరాబాద్‌), పవన్‌, నగేష్‌(మల్కాజిగిరి)గా గుర్తించారు.

webtech_news18

Top Stories