టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు అజారుద్దీన్ సీఎం కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహ విందుకు సీఎంను వారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. కాగా, డిసెంబరు 12న ఆనమ్-అసదుద్దీన్ వివాహ విందు కార్యక్రమం జరగనుంది.