రేపు జరిగే జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొంటానని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు.రేపు జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరూ బయటకు రాకుండా ఉంటే కొంత మేర ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.