హైదరాబాద్లో టీఆర్ఎస్ సర్కారుపై నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్లో ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అటు.. టీఆర్టీ పీఈటీ అభ్యర్థులు కూడా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.