HOME » VIDEOS » Telangana

Video: హార్వెస్టర్ ఎక్కిన మంత్రి పువ్వాడ.. ఎందుకో తెలుసా..

తెలంగాణ17:53 PM April 03, 2020

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరికోత మిషన్‌ను ఎక్కారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్ల గ్రామంలో పొలంలో వరికోతను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ రైతులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడా హార్వెస్టర్లకు కొరత లేదని తెలిపారు. జిల్లాలో 365 వరికోత మిషన్లు సిద్ధంగా ఉన్నాయని, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మరిన్ని హార్వెస్టర్లను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే చెన్నై సమీపంలోని సేలం నుంచి 100 వరికోత యంత్రాలు వస్తున్నాయని, త్వరలోనే అవి జిల్లాకు చేరుకుంటాయని పేర్కొన్నారు. రబీ సీజన్‌లో సాగు చేసిన ఏ ఒక్క ఎకరంలోనూ పంట మిగలకుండా సకాలంలో కోతలను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.

webtech_news18

Top Stories