హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: చెరువులోకి కాలుష్య జలాలు...వేలాది చేపలు మృతి

తెలంగాణ22:23 PM August 06, 2019

చెరువులోకి పారిశ్రామిక వ్యర్థాలు వదలడంతో వేలాది చేపలు చనిపోయాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదలలో ఈ ఘటన జరిగింది. రసాయన పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య జలాలను చెరువులోకి వదలకూడదని ఎన్నో సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడంతో అధికారుల్లో చలనం వచ్చింది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే జలాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు.

webtech_news18