నిజామాబాద్ నగరంలో డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు లాక్డౌన్ తీరును పరిశీలించారు. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాలైన గోల్డెన్ జూబ్లీ, ఖిల్లారోడ్, ఆటో నగర్, 14వ డివిజన్ అక్బర్ భాగ్, ఎల్లమ్మగుట్టతో పాటు పలు కాలనీల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అనవసరంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.