ఓ మహిళ అదుపుతప్పి బైక్ పైనుంచి కిందపడింది. గాయాలు కావడంతో ఆమె పైకి లేవలేని పరిస్థితి. అదే సమయంలో అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు.. ఆమెను చూశాడు. వెంటనే మహిళ వద్దకు పరుగుగెత్తుకెళ్లి.. ఆమెను చేతులపై తీసుకెళ్లి ఆటోలో ఎక్కించాడు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. హైదరాబాద్లోని పంజాగట్టలో సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ఈ ఘటన జరిగింది.