హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఒక్క ఆటోలో 24 మంది ప్రయాణికులు... ఆపేసిన పోలీసులు...

తెలంగాణ12:50 PM August 12, 2019

తెలంగాణ... కరీంనగర్ పోలీసులు ఓ ఆటోను చూసి షాకయ్యారు. మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో... ఒకే వాహనంలో 20 మందిని ఎక్కిస్తే... ఈ ఆటోలో ఏకంగా 24 మంది ప్రయాణికులున్నారు. మొదట ఏ 10 మందినో ఎక్కించినట్లు కనిపించినా... ఒక్కొక్కరూ దిగుతుంటే... పోలీసులకే ఆశ్చర్యమేసింది. మొత్త ఎంతమంది అని లెక్కించి... షాకయ్యారు. అసలు అంత మంది ఒక్క ఆటోలో ఎలా పట్టారన్నదే వాళ్లకు అర్థం కాలేదు. వాళ్లందర్నీ ఆటో పక్కన నిలబెట్టి... ఫొటోలు తీశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని... కరీంనగర్ కమిషనర్... ఈ ఆటోకి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆటో డ్రైవర్లు ఆదాయం కోసం ఇష్టమొచ్చినట్లు ప్రయాణికుల్ని ఎక్కించేసుకోవడం సహజంగా జరుగుంతోందన్న పోలీసులు... ప్రయాణికులు తమ సేఫ్టీని ఆలోచించుకోవాలని హెచ్చరించారు.

Krishna Kumar N