హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: షాద్‌నగర్‌లో లాఠీ చార్జి.. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

తెలంగాణ18:55 PM November 30, 2019

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువకులు,ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన పోలీసుల్లో నెలకొంది. దీంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఐదు విభాగాల పోలీసులను రంగంలోకి దించారు. స్వల్ప లాఠీ చార్జితో ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.

webtech_news18