హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రోహిత ఆచూకీ దొరికింది. గచ్చిబౌలి పోలీసులు పుణెలో ఆమె ఆచూకీని కనుగొన్నారు. కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేందుకు రోహిత ఒప్పుకోకపోవడంతో.. పుణెలోని బంధువులకు ఆమెను అప్పగించారు. ఈ సందర్భంగా రోహిత స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. పోలీసులు చాలా కోణాల్లో దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనుగొన్నారు.