లారీలను టార్గెట్చేసి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ అవినీతి పోలీసు కెమెరాకు చిక్కాడు. రాత్రివేళల్లో లారీలను ఆపి ఏవేవో రూల్స్ మాట్లాడి డబ్బులను గుంజుతాడు. నడిరోడ్డుపై వసూలు చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. వరంగల్లోని మట్వాడా పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వీడియో ఆధారంగా అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.