HOME » VIDEOS » Telangana

ఉత్తమ్, భట్టి విక్రమార్కను అరెస్ట్ చేసిన పోలీసులు..

తెలంగాణ17:30 PM June 06, 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 19 స్థానాల్లో గెలవగా... వారిలో 12 మంది ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్‌లో చేరిపోయారు. వారంతా స్పీకర్ పోచారంకి లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో కలిపేయాలని కోరారు. ఇందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటంతో... ఈ ప్రక్రియ సజావుగా సాగిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... 12 మంది ఎమ్మెల్యేలకు విందు సమావేశం ఏర్పాటు చేసి... విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఆవరణలో దీక్షకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

webtech_news18

Top Stories