ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ వాహనాలు జనం నుంచి డబ్బులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో కూడా ఇదే పరిస్థితి. దీంతో ప్రయాణికులు అద్దె బస్సుల్లో కండక్టర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇంతలా దోపిడీకి దిగుతారా అంటూ మండిపడుతున్నారు.